Sunday, December 22, 2024

నిమ్స్‌లో 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు

- Advertisement -
- Advertisement -

నిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కువగా అందించాలి

హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లతో రిజర్వేషన్లు అమలుచేశామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఇంకా కొన్ని ఖాలీలున్నాయి… వాటిని కూడా భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. నిమ్స్ ఆస్పత్రిపై ప్రజలకు అధిక విశ్వాసం ఉందన్నారు. నిమ్స్ దవాఖానకు వచ్చేవారు పేదవారు. పేద రోగులకు ప్రేమను, మమకారాన్ని పంచండని మంత్రి వైద్య సిబ్బందికి సూచించారు. బాగా పనిచేసే వైద్యులకు ప్రోత్సాకాలు పెంచుతామని తెలిపారు. నిమ్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కువగా అందించాలన్నారు. ఎల్ వోసీ కూడా నిమ్స్ కే ఎక్కువగా ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News