Sunday, January 19, 2025

ఛత్తీస్‌గఢ్ మొదటి దశ ఎన్నికల అభ్యర్థుల్లో 26 మందిపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ మొదటిదశ ఎన్నికల్లో పోటీకి నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 26 మందిపై క్రిమినల్ కేసులున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. ఈ 26 మందిలో 16 మందిపై తీవ్రమైన నేరాలు నమోదై ఉన్నాయి. విపక్షమైన బీజేపీ అభ్యర్థులు 20 మందిలో ఐదుగురు ( 25 శాతం) , అధికారపార్టీ కాంగ్రెస్ 20 మంది అభ్యర్థుల్లో ఇద్దరు (10 శాతం),ఆమ్‌ఆద్మీ పార్టీ 10 మంది అభ్యర్థుల్లో నలుగురు (40 శాతం ) , జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె)15 మంది అభ్యర్థుల్లో ముగ్గురు ( 20 శాతం) క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ దశ 20 నియోజకవర్గాల్లో కంకేర్, చిత్రకోట్, ఖైరాగఢ్, పండరీయ, కవర్థా ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు క్రిమినల్‌కేసులు ఎదుర్కొంటున్నారని నివేదిక వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News