- Advertisement -
పనాజీ: గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) లో ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. రెండు నుంచి 6 గంటల వ్యవధిలో 26 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరాలో జాప్యమే మృతికి కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే హైకోర్టు విచారణ జరపాలని కోరారు. ఈ వార్త తెలియగానే జిఎంసిహెచ్‌ను సందర్శించిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, “వైద్య ఆక్సిజన్ లభ్యత, జిఎంసిహెచ్‌లోని కోవిడ్ -19 వార్డులకు సరఫరా చేయడంలో రోగులకు కొన్ని సమస్యలను కలిగించి ఉండవచ్చు” అని గోవా సిఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.
26 Covid patients die at Goa Govt hospital
- Advertisement -