Sunday, November 17, 2024

ఆపరేషన్ చక్ర కింద 26 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

CBI's Operation Chakra

న్యూఢిల్లీ:  దేశంలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ ముఠాలను నిర్మూలించేందుకు సిబిఐ చేపట్టిన ‘ఆపరేషన్ చక్ర’ కింద ఇప్పటివరకు 26 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. రాష్ట్ర పోలీసులు, ఇంటర్‌పోల్, ఇతర దేశాల ఏజెన్సీల సమన్వయంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు. 16 మందిని కర్ణాటక పోలీసులు, ఏడుగురిని ఢిల్లీ పోలీసులు, ఇద్దరిని పంజాబ్ పోలీసులు, ఒకరిని అండమాన్ నికోబార్ పోలీసులు అరెస్టు చేసినట్లు సిబిఐ తెలిపింది.

ఇంటర్‌పోల్, ఎఫ్‌బిఐ, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్,  ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు అందించిన సమాచారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) , రాష్ట్ర పోలీసులతో సమన్వయంతో దేశవ్యాప్తంగా 115 ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై సిబిఐ 11 కేసులు నమోదు చేసింది. ఏజెన్సీ 87 చోట్ల సోదాలు నిర్వహించగా, 28 చోట్ల రాష్ట్ర పోలీసులు దాడులు చేశారని వారు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News