Thursday, January 23, 2025

టోర్నడోలతో 8 రాష్ట్రాల్లో విలయం: 26 మంది మృతి

- Advertisement -
- Advertisement -

విన్నె : తుఫాన్లు, వీటిని ఆవాసంగా చేసుకుని ఏర్పడే విపరీత స్థాయి వేగవంతం అయిన శంఖాకారపు టోర్నడోలు అమెరికాలో ఇప్పుడు పలు రాష్ట్రాలలో పెను నష్టాన్ని కల్గిస్తున్నాయి. దక్షిణ , నడి పశ్చిమ ప్రాంత రాష్ట్రాలలోని పలు పట్టణాలు, పెద్ద నగరాలు ప్రత్యేకించి ఈ టోర్నడోల విలయానికి తల్లడిల్లుతున్నాయి. టోర్నడోలతో తలెత్తిన విధ్వంసంతో ఇప్పటివరకూ పలు చోట్ల కనీసం 26 మందికి పైగా మృతి చెందారు. ఇళ్లకు భారీగా నష్టం వాటిల్లి, విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడటంతో జనం పలు చోట్ల నానా అగచాట్లకు గురవుతున్నారు.

అర్కాన్‌సాస్ రాజధాని మీదుగా ఓ నిర్థిష్ట దారిలో టోర్నడోలు వలయాలు తిరుగుతూ భీభత్సం సృష్టించాయి. ఇలినోయిస్‌లో జనంతో కిక్కిరిసి ఉన్న ఓ ఉత్సవ వేదిక పై కప్పు కుప్పకూలింది. దీనితో పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. శనివారం పలు ప్రాంతాలలో టోర్నడోల భయాలు నెలకొన్నాయి. కనీసం ఎనిమిది రాష్ట్రాలలో టోర్నడోల ప్రభావం తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాలలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చెట్లు కుప్పకూలాయి. టెన్నెస్సీ కౌంటీలో కనీసం తొమ్మండుగురు తీవ్ర గాలుల ధాటితో జరిగిన పరిణామాలతో దుర్మరణం చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News