Friday, December 20, 2024

హాస్టల్లో 26మంది బాలికలు మిస్

- Advertisement -
- Advertisement -

ఒక హాస్టల్లో ఏకంగా 26మంది బాలికలు అదృశ్యమైన సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో కలకలం సృష్టిస్తోంది. పర్వాలియా ప్రాంతంలో ప్రైవేటుగా నడుస్తున్న ఆంచల్ బాలికల హాస్టల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన బాలికల వయసు ఆరునుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుంది.

మొత్తం 68మంది బాలికలు హాస్టల్లో ఉండవలసి ఉండగా 42మందే ఉండటంతో అనుమానం వచ్చిన ప్రియాంక్.. హాస్టల్ డైరెక్టర్ ను నిలదీశారు. అతనినుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ ను అక్రమంగా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో హాస్టల్ కు కాపలాగా మగ సిబ్బందిని నియమించడం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News