Monday, January 20, 2025

రాష్ట్రంలో 26 మంది ఐఎఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను రేవంత్ సర్కార్ మారుస్తూ వస్తోంది. తాజాగా బుధవారం తెలంగాణలో 26 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను రేవంత్ సర్కార్ మారుస్తూ వస్తోంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సభర్వాల్ కూడా ఈ లిస్టులో వున్నారు. ఈమెకు రేవంత్ రెడ్డి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనని గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొనగా బుధవారంతో దానికి తెరపడింది. బదిలీ అయిన ఐఎఎస్‌లలో స్టేట్ ఫైనాన్స్ కమీషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ను నియమించింది. నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్, పురావస్తుశాఖ డైరెక్టర్‌గా భారతి హోళికేరి, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి, కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్,

మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండిగా ఆర్.వి.కర్ణన్, సిఎంవొ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంక, నల్గొండ కలెక్టర్‌గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బి.ఎం.సంతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్, బిసి సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, జిఎడి కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు, పంచాయతీరాజ్, ఆర్‌డి కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News