Monday, December 23, 2024

పేపర్ లీకేజీల్లో పెద్దన్నలు మీరే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో ప్రశ్నపత్రం లీకేజీపై బిజెపి, కాంగ్రెస్ యువతను తప్పుదోవ పట్టించే చేస్తున్నాయి.. కానీ, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన లీకేజీ ఉదంతాలకు లెక్కేలేదని బిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పదుల సంఖ్యలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు లక్షలాదిమంది నిరుద్యోగుల కలల్ని కూల్చాయని మండిపడుతున్నారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ ఘనటలు గత కొన్నేళ్లుగా వెలుగుచూస్తున్నా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతను తప్పుదోవ పట్టించేందుకు బిజెపి, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తున్నాయి.

రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీకే జీ ఘటనల గురించి ఏమాత్రం మాట్లాడకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బిఆర్‌ఎన్ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదన్నరేళ్లలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన వాస్తవాలను ఆ పార్టీ నేతలు ఎక్కడా ప్రస్తావించకుండా పేపర్ లీకేజిలపై కాంగ్రెస్, బిజెపిలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, ప్రభుత్వమే లీకేజి వ్యవహారాన్ని గుర్తిం చి విచారణ జరిపించి, దోషులను శిక్షించేలా చర్యలు తీసుకుంటుందన్న వాస్తవాలను ఎక్కడా చెప్పడం లేదని బిఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.

రాజస్థాన్‌లో పదేళ్లలో 26 పేపర్ లీకులు
రాజస్థాన్‌లో 2011 నుంచి 2022 వరకు పదేళ్లలో 26 పేపర్ లీకుల ఘటనలు జరుగగా, వాటిలో 14 పేపర్ లీకులు గత నాలుగేళ్లలోనే అంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజస్థాన్‌లో పేపర్ లీకేజీలు సాధారణం కావడంతో ఆ రాష్ట్రం దేశానికే పేపర్ లీకేజీ రాజధానిగా పేరుపొందితుంది. రాజస్థాన్‌లో 2019 నుండి సగటున ప్రతి సంవత్సరం మూడు పేపర్ లీకేజీ ఘటనలు నమోదవుతున్నాయి. దీని వల్ల సుమారు 40లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలను బట్టి ప్రశ్నాపత్రాలకు రూ. 5లక్షల నుంచి రూ.15లక్షల ధర పలుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసుల విచారణలోనే తేలింది. గత ఏడాది జరిగిన రాజస్థాన్ ఎలిజిబులిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. 11జిల్లాల్లో ఇంటర్నెట్ షట్డౌన్ చేసినా కూడా పేపర్ లీక్ అయ్యింది. 2022 మేలో జరగాల్సిన రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. 2021లో రాజస్థాన్‌లో జరిగిన ఎస్సై నియామక పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. అభ్యర్థులకు బయటి నుం చి జవాబులు అందించిన ఘటన బయటకు వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News