- Advertisement -
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌నుంచి పొరుగుదేశాలకు వలస వెళ్లిన భారతీయులను వెనక్కి తీసుకు రావడం కోసం ప్రభుత్వం రాబోయే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలను నడుపుతుందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు. ఉక్రెయిన్‌నుంచి భారతీయులను తీసుకువచ్చే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీమంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రింగ్లా ఈ విషయం తెలిపారు. ప్రభుత్వం తొలి అడ్వైజరీ జారీ చేసిన సమయంలో ఉక్రెయిన్‌లో దాదాను 20 వేల మంది భారతీయులు ఉన్నట్లుగా అంచనా వేశాం. వీరిలో దాదాపు 12 వేల మంది ఉక్రెయిన్ వదిలి వెళ్లారు. అంటే ఉక్రెయిన్‌లో ఉన్నం మొత్తం భారతీయుల్లో ఇది 60 శాతం అని హర్షవర్ధన్ చెప్పారు.
- Advertisement -