హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించామని మంత్రి కెటిఆర్ తెలిపారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోలో కెటిఆర్ ప్రసంగించారు. గత పాలనలో విద్యుత్ సమస్యతో ఇన్వర్టర్, జనరేటర్లతో కొనసాగించామని, ఇవాళ చిన్న పరిశ్రమలకు సైతం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఇవాళ రాష్ట్రంలో 26 వేల మెగావాట్లతో విద్యుత్ అందిస్తున్నామని, హైదరాబాద్ పట్టణంలో ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామని వివరణ ఇచ్చారు.
సిఎం కెసిఆర్ దార్శనకతతో వందల కిలో మీటర్ల నుంచి కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బాగుండటం వల్ల పరిశ్రమలు తరలి వెళ్తున్నాయని, సూపర్‌స్టార్ రజనీకాంత్ హైదరాబాద్‌ను న్యూయార్క్ సిటీతో పోల్చారని కెటిఆర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఎకరా భూమితో ఎపిలో వందల ఎకరాలు కొనవచ్చని ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ సాధించిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, సినిమా ముందుందన్నారు. శంషాబాద్-గచ్చిబౌలి వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో టెండర్లు పూర్తి చేశామన్నారు.
Also Read: అరెస్టు చేస్తే భయపడం: బాలకృష్ణ