Sunday, February 23, 2025

అమ్రాబాద్ జోన్‌లో 26 పులులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమ్రాబాద్ అభయారణ్యంలో 26 పులులు ఉన్నాయి. ఇందులో 22 అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కాయి. మరో నాలుగింటిని పాదముద్రల ద్వారా గుర్తించారు. ఈ పులుల వివరాల్ని అటవీశాఖ ’టైగర్ బుక్ ఆఫ్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు’ పేరుతో ఇటీవల విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వు సంఖ్య 51 అందులో రాష్ట్రంలో కవ్వాల్, అమ్రాబాద్ ఉన్నాయి.

పులులు ప్రధానంగా సంచరించే కోర్ ఏరియా విస్తీర్ణంలో చూస్తే అమ్రాబాద్. దేశంలో రెండో అతిపెద్ద రిజర్వుగా గుర్తింపు పొందింది. పెద్ద పులులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు నీల్గాయిలు, చుక్కల దుప్పులు, అడవి పందులు, కోతులు నల్లమల అడవుల్లో పెద్దసంఖ్యలో ఉన్నట్లు అటవీశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News