Wednesday, January 22, 2025

మాలిలో తీవ్రవాదుల దాడి 26 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బుర్కినా ఫాసో: మాలిలో కూలీలపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది గ్రామస్థులు చనిపోయారు. బుర్కినాఫాసో సరిహద్దులోని ఓ గ్రామానికి చెందిన కూలీలు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా జెఎన్‌ఐఎమ్ అనే తీవ్రవాదులు వారిపై కాల్పులు జరపడంతో 26 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరి కొంత మంది గ్రామస్థులు తీవ్రంగా గాయపడ్డినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జెఎన్‌ఐఎమ్ అనే తీవ్రవాద అల్‌ఖైదా సంబంధాలు ఉన్నాయని పలుమార్లు మాలి పోలీస్ అధికారులు తెలిపారు. గత నెలలో పెళ్లి వేడుక జరుగుతుండగా వారిపై కాల్పులు తెపడడంతో 21 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News