చైబసా(జార్ఖండ్): పశ్చిమ సింగ్‌భం జిల్లాలో ఒక 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సామూహిక అత్యాచారానికి గురైనట్లు శనివారం పోలీసులు తెలిపారు. ఒక ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆ మహిళ వర్క్‌ఫ్రమ్ హోం కింద ఇక్కడే ఉంటున్నారు. గురువారం సాయంత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి టూవీలర్‌లో బయటకు వెళ్లగా చైబసాలోని పాత ఏరోడ్రోమ్ సమీపంలోని ఒక నిర్జన ప్రదేశంలో దాదాపు 10 మంది వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. స్కూటర్‌పై వెళుతున్న వారిని అడ్డగించిన 8 మంది వ్యక్తులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్‌పి అషుతోష్ శేఖర్ తెలిపారు. ముఫసిల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్(సదర్) దిలీప్ ఖల్కో తెలిపారు. అత్యాచారం తర్వాత ఆమెను అక్కడే వదిలేసి నిందితులు ఆమె పర్సును, మొబైల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయారని ఆయన చెప్పారు.
జార్ఖండ్‌లో 26 ఏళ్ల టెకీపై సామూహిక అత్యాచారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -