హైదరాబాద్ పరిధిలోని 23 ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేశామని హైడ్రా అదికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని వెల్లడించారు. ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీన చేసుకున్నామన్నారు. మాదాపూర్ సున్నం చెరువులో 42 అక్రమ నిర్మాణాలు, దుండిగల్ కత్వా చెరువలో 13, గగన్ పహాడ్ అప్ప చెరువులో 14, అమీన్ పూర్ పెదు చెరువు పరధిలో 24, రామ్ నగర్ లోని మణెమ్మ గల్లీలో మూడు అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు. అమీన్ పూర్ చెరువులో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ తో పలువురు విల్లాలు కూలగొట్టిన విషయం తెలిసిందే. చెరువుల పరిధిలోని ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ల లో ఉన్న నిర్మాణాలను కూల్చడం ఖాయమని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైడ్రా రంగ ప్రవేశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులపై ప్రజల్లో పెనుమార్పు వచ్చిందనీ, ఈ నేపథ్యంలోనే హైడ్రాను రీజినల్ రింగ్ రోడ్ వ రకు విస్తరించి ఔటర్ వెలుపల ఉన్న చెరువులను కాపాడే దశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత: హైడ్రా
- Advertisement -
- Advertisement -
- Advertisement -