ఢాకా: బంగ్లాదేశ్‌లోని షీతాలఖ్యా నదిలో 100మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఒక చిన్న లాంచీ ఎదురుగా వస్తున్న సరకు రవాణా నౌకను ఢీకొని మునిగిపోవడంతో 27మంది మరణించారు. ఢాకాకు సుమారు 16 కిలోమీటర్ల దూరంలోని నారాయణ్‌గంజ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం సంఘవించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం నదిలో నుంచి ఐదు మృతదేహాలను వెలికితీయగా సోమవారం భారీ క్రేన్ల సాయంతో నీట మునిగిన లాంచీని వెలికితీయడంతో మరో 22 మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. నేవీ, కోస్ట్ గార్డు, ఫైర్ సర్వీస్, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సరకు రవాణా నౌక ఆగకుండా అక్కడ నుంచి వెళ్లిపోయిందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు నారాయణ్‌గంజ్ డిప్యుటీ కమిషనర్ ముస్తేన్ బిల్లా తెలిపారు.
27 died as Launch capsizes after Collision with Cargo ship