Friday, November 22, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27ఇండ్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

27 houses gutted in fire in Himachal Pradesh's Majhan

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కుల్లూ జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్‌హన్‌ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్క పక్కనే ఉన్న 26 ఇండ్లతోపాటు 2 దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు వ్యాపించాయి. దీంతో అవి పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.9కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన హిమాచల్‌ప్రదేశ్‌ సిఎం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులను ఆదుకుంటామని హామి ఇచ్చారు. హిమాచల్ కులులోని సైంజ్ వ్యాలీలో మజాన్.

27 houses gutted in fire in Himachal Pradesh’s Majhan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News