Thursday, January 16, 2025

స్కూల్ శిబిరంపై ఇజ్రాయెల్ దాడి..27 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కొట్టుమిట్టాడుతోన్న గాజాస్ట్రిప్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి జరిగింది. ఇక్కడి స్కూల్‌లో వెలిసిన నిర్వాసితుల శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 27 మంది చనిపొయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనియా వైద్య అధికారులు గురువారం తెలిపారు. డీర్ అల్ బలా ప్రాంతంలో జరిగిన దాడిలో జనం శరీర భాగాలు ముక్కలైనట్లు ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బంది తెలిపింది. తరచూ జరుగుతోన్న దాడుల నుంచి తప్పించుకునేందుకు స్కూళ్లో బాధితులు తలదాచుకుంటుండగా దాడి జరిగింది. అయితే పౌరుల మధ్య మిలిటెంట్లు ఉంటున్నారనే సమాచారం అందడంతోనే తాము దాడికి దిగినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు తరువాత తెలిపాయి.

అయితే దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఓ వైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లపై దాడులు జరుపుతూనే, మరో వైపు ఇరాన్ స్థావరాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ వ్యూహరచన చేసుకుంటోంది. వీటి గురించి ప్రపంచం దృష్టి సారించడకుండా ఉండేందుకు గాజాపై ఇటీవలి రోజులలో దాడులను ముమ్మరం చేసింది. తమకు మిలిటెంట్ల స్థావరాల గురించి తెలియగానే దాడులు చేస్తూనే ఉంటామని, అవి ప్రజా ఉపయుక్త కేంద్రాలా ? మరోటా అనేది తమకు అవసరం లేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News