Monday, December 23, 2024

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మందితో ప్రయాణిస్తున్న వాహనం రూరల్ గుయిజౌ ప్రావిన్స్ లోని జాతీయ రహదారిపై ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో 27మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 20మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీస్, రిస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. చాలావరకు పర్వత ప్రాంతమైన గుయిజౌ లోని కియాన్నన్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇదే ప్రావిన్సులో ఈ ఏడాది జూన్‌లో ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మార్చిలో ఓ ప్యాసింజర్ జెట్ విమానం కుప్పకూలిన ఘటనలో 132 మంది చనిపోయారు. తాజాగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఈ ఏడాదిలో అతిపెద్దదని అధికారులు తెలిపారు.

27 Killed in Road Accident in China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News