మృతుల్లో కేంద్ర
కమిటీ సభ్యుడు
జయరాం అలియాస్
చలపతి ఆయన
తలపై కోటి రూపాయల
నజరానా చలపతిది
ఆంధ్రప్రదేశ్‌లోని
చిత్తూరు జిల్లా
నక్సలిజం తుది శ్వాస
విడిచింది : అమిత్
మన తెలంగాణ/చర్ల : వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం అట్టుడుకుతోంది. ఛత్తీస్‌గఢ్‌ఒడిశా సరిహద్దుల్లో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మావోయిస్టులు మంది మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఉన్నా రు. ఆయన తలపై కోటి రూపాయల నజరానా ఉంది. నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఛత్తీస్‌గఢ్‌ఒడిశాకు చెందిన సంయుక్త బలగాలు గరియాబంద్ జిల్లా పరిధిలోని కులహాదీ ఘాట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్ర మంలో సోమవారం రాత్రి మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌ఒడిశా సంయుక్త
బృందాలు ఈ 30, సిఆర్‌పిఎఫ్, కోబ్రా 25 బెటాలియన్‌కు చెందిన జవాన్లు, సిఆర్‌పిఎఫ్ 65, 201 బెటాలియన్‌తో పాటు ఎస్‌ఓజి నువ్వా పాడ బృందం సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య అడపదడపా కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సమయంలో ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌తో పాటు పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటన ప్రాంతం నుంచి 20 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా మావోయిస్టు సంస్థ అధిపతి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
నక్సలిజానికి మరో గట్టి దెబ్బ తగిలిందని, నక్సల్స్ రహిత భారత్ నిర్మాణంలో భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. సిఆర్‌పిఎఫ్, ఎస్‌ఒజి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఒడిశా -ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సంయుక్త ఆపరేషన్‌లో 27 మంది నక్సలైట్లను మట్టుబెట్టారని అన్నారు. నక్సల్స్ రహిత భారతదేశం కోసం మన సంకల్పం, మన భద్రతా దళాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజం తుదిశ్వాస విడిచిందంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
డబుల్ ఇంజన్ సర్కార్ విజయం : ఛత్తీస్‌గఢ్ సిఎం
చత్తీస్ గఢ్ లోనూ, కేంద్రం లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే నక్సల్స్ నిర్మూలన సాగుతోందని, 2026 మార్చికల్లా చత్తీస్ గఢ్ నక్సల్స్ రహిత రాష్ట్రం కాగలదని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అన్నారు. పోలీసులు, సీఆర్ పీఎఫ్ జవాన్ల సాహసం వల్లనే ఇది సాద్యమవుతోందని చెబుతూ వారి కి శాల్యూల్ అన్నారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో 12 మంది నక్సలైట్లు చనిపోగా, ఆనాడు 18 మంది చనిపోయినట్లు నక్సల్స్ ప్రకటించారు. నిరుడు వివిధ ఎన్ కౌంటర్లలో దాదాపు 219 మంది నక్సల్స్ హతమయ్యారు.