Wednesday, January 22, 2025

బంగారు గనిలో అగ్ని ప్రమాదం: 27 మంది సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

లిమా: పెరూలోని లాఎస్పారంజా బంగారు గనిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్‌తోనే గనిలో మంటలు చెలరేగాయి. భూమికి వంద మీటర్ల లోతులో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. గనిలో ఉన్న  కార్మికులకు ఆక్సిజన్ అందక చనిపోయారని యనక్వా మేయర్ జేమ్స్ క్యాష్కోనో తెలిపారు.

Also Read: లోన్‌యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

2002లో వేర్వేరు మైనింగ్ ప్రమాదాల్లో 73 మంది సజీవ దహనమయ్యారు. 2022లో జరిగిన అగ్నిప్రమాదంలో కూడా 39 మంది, 2020లో నలుగురు చనిపోయారు. మినెరా యనక్వా కంపెనీ మైనింగ్ ఉద్యోగులే చనిపోయారు. ఈ కంపెనీ గత 23 సంవత్సరాల నుంచి మైనింగ్ విభాగంలో సేవలందిస్తుంది. ప్రపంచంలో వెండి, కాపర్, జింక్ ఉత్పతి చేయడంలో పెరూ రెండో స్థానంలో ఉంది. జింక్, టిన్, లెడ్, మెలిబ్డియం ఉత్పత్తి చేయడంలో లాటిన్ అమెరికా తొలి స్థానంలో ఉంది. బంగారం ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో పెరూ నంబర్ వన్ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News