Monday, December 23, 2024

క్రమంగా ఆంక్షల వలయంలోకి

- Advertisement -
- Advertisement -

27 thousand Covid new cases in single day in India

దేశంలో ఒకేరోజు 27వేల కొవిడ్ కొత్త కేసులు
1525కు చేరిన ఒమిక్రాన్ బాధితులు
పశ్చిమబెంగాల్‌లో విద్యాసంస్థల బంద్ రాత్రి 10 వరకే షాపింగ్‌మాల్స్, మార్కెట్లు
విమాన సర్వీసులపైనా ఆంక్షలు

n కొవిడ్ కట్టడికి నేటి నుంచి కఠిన నిబంధనలు రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకే అత్యవసర
సర్వీసులు n రాత్రి 10 వరకే బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు కార్యాలయాలు
n వాణిజ్యసంస్థలు, ఫ్యాక్టరీల్లో 50% సిబ్బందికే అనుమతి n జిమ్స్, పూల్స్, వెల్‌నెస్ సెంటర్లు, స్పాలు
మూసివేత n వారానికి రెండుసార్లే ఢిల్లీ, ముంబై నుంచి విమాన సర్వీసులు

కొల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కరోనా కేసులు పె రుగుతుండడంతో రాష్ట్రప్రభుత్వం కరోనా కట్టడికి ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. సోమవారం నుం చి స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. కార్యాలయాలు, సినిమా హాళ్లు, థియేటర్లు, 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించింది. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, తేయాకు తోటలు తదితర వాణిజ్య సంస్థల యాజమాన్యాలు కచ్చితంగా కొ విడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. రా ష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది ఆదివారం పాత్రికేయుల సమావేశంలో ఈ వివరా లన్నీ తెలియచేశారు. రోజూ రాత్రి 10 నుంచి తెల్ల వారు జాము 5 గంటల వరకు మాత్రమే అత్యవ సర సర్వీసులను అనుమతిస్తున్నట్టు ప్రకటించా రు. బార్లు, రెస్టారెంట్లు సగం సిబ్బందితో రాత్రి 10 గంటల వరకే పనిచేస్తాయి.

రాత్రి 7 గంటల వరకు లోకల్ ట్రైన్లు 50 శాతం ప్రయాణికులతో నడుస్తాయని, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సగం సిబ్బందితో రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప నిచేస్తాయని తెలియజేశారు. పర్యాటక ప్రదేశాలు జూలతో సహా మూసివేస్తారు. ఇవేకాక స్మిమ్మింగ్ పూల్స్, పార్లర్లు, స్పా, వెల్‌నెస్ సెంటర్లు, జిమ్స్ మూతపడతాయి. ముంబై, ఢిల్లీ నగరాల నుంచి వారానికి రెండుసార్లే కొల్‌కతాకు విమాన సర్వీసు లు నడుస్తాయి. బ్రిటన్ నుంచి ఏ విమాన సర్వీసు లను అనుమతించరు. సమావేశాలు, సదస్సులు 50శాతం కెపాసిటీతో గరిష్ఠంగా 200 మందితో మాత్రమే అనుమతిస్తారు. ఆహారం, ఇతర నిత్యా వసరాలు యథాప్రకారం సరఫరా అవుతాయి. పె ళ్లిళ్లకు 50కి మించకుండా అతిథులను అనుమతి స్తారు. అంత్యక్రియలకు కేవలం 20 మందినే అ నుమతిస్తారు. శనివారం పశ్చిమబెంగాల్‌లో తా జాగా కొవిడ్ కేసులు 4512 వరకు నమోదయ్యా యి. అంతకు ముందు రోజు కన్నా 1061 కేసులు ఎక్కువ. కొల్‌కతాలో కొత్త కేసులు 2398 వరకు నమోదయ్యాయి.

దేశంలో 1525కి చేరిన
ఒమిక్రాన్ కేసులు
27వేలు దాటిన కరోనా కొత్త కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడి చిన 24 గంటల్లో 27 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆం దోళన కలిగిస్తోంది. అంతకుముం దు పోల్చితే కొత్త కేసుల్లో 21 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు ఇదే సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ విస్తరించింది. శనివారం ఉదయానికి 1400 గా ఉన్న కొత్త వేరియంట్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయానికి 1525 కి చేరింది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర (460), ఢిల్లీ (351) తొలి రెండు స్థానాల్లో ఉండగా, గుజరాత్ (136), తమిళవాడు (117) , కేరళ (109) కేసులతో కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో 67, ఆంధ్రప్ర దేశ్‌లో 17, కేసులు ఉన్నాయి. కొత్త వేరియంట్ నుంచి ఇప్పటివర కు 560 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

శనివారం 10,82,376 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 27,553 కొత్త కేసులు వెలుగు లోకి వచ్చాయి. కొవిడ్‌తో చికిత్స పొందుతూ గత 24 గంట ల్లో 284 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,81,770 కి చేరింది. ఇక కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసు లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 1,22,801 గా ఉన్నాయి. ఆ రేటు 0.35 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 9,249 మంది కోలుకోగా, ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.42 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.27 శాతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 25,75,225 మంది టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 145 కోట్లు దాటింది.

నేటినుంచి సుప్రీంలో
మళ్లీ వర్చువల్ విచారణ

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి (సోమవారం) వర్చువల్ పద్ధతిలో కేసుల విచారణ జరుగుతుందని తెలియచేసింది. రెండు వారాల పాటు ఈ విధానం లోనే కేసుల విచారణ జరుగుతుందని పేర్కొంది. కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫూ అమలు చేస్తుండగా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇతర ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రత్యక్ష విచారణను సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో కొవిడ్ కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే వర్చువల్ గానే విచారణలు జరిగాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News