Monday, December 23, 2024

27వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలి

- Advertisement -
- Advertisement -

ఫర్టిలైజర్ సిటీ: ఆర్‌ఎఫ్‌సిఎల్ ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణ జిల్లాలకు జూన్ నెలలో 27వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఎం.రఘునందన్ రావు అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ ఎం.రఘునందన్ రావు, ఫర్టిలైజర్ జెడిఎ రాములు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ఎఫ్‌సిఎల్ ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణ జిల్లాలకు సరఫరా చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా ఆర్‌ఎఫ్‌సిఎల్ అధికారులకు, మార్కెటింగ్ అధికారులతో సయంపక్తంగా సమావేశం ఏర్పాటు చేసి, వారిని యూరియాను తెలంగాణ జిల్లాలకు జూన్ నెలలో 27వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని, ఆర్‌ఎఫ్‌సిఎల్‌ప్లాంట్ జూన్ నెలలో 15 రోజులు యూరియాను ఉత్పత్తి చేయలేదని, తొలకరి వానల కారణంగా ఈ జూలై, ఆగస్టు మాసాలలో యూరియా వినియోగం అధికంగా ఉండటం వలన ఫర్టిలైజర్ కంపెనీ నుంచి సప్లై ప్లాన్ ప్రకారం యూరియాను పంపించాల్సింగా ఆయా కంపెనీలను ఆదేశించడం జరిగిందని అన్నారు.

ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం కూడా జూన్ నెలలో తెలంగాణకు రావాల్సిన 27వేల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం వ్యవసాయ సెక్రటరీ చిన్న కల్వల రైతు వేదికలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, వ్యవసాయాధికారులు, ఎడిఎలతో సమావేశం ఏర్పాటు చేసి, వ్యవసాయ శాఖ పథకాలపై ఎఈవోలో అధికారులతో చర్చించడం జరిగింది. కార్యక్రమంలో దోమ ఆదిరెడ్డి, ఎడిఎ శ్రీనాథ్, కాంతా రావు, ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యం అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News