Sunday, December 22, 2024

టెట్ దరఖాస్తులు 2,75,773

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు ముగిసింది. టెట్‌కు మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పేపర్ 1కు 94,335 దరఖాస్తులు రాగా, పేపర్ 2కు 1,81,438 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 5 నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభం కాగా, బుధవారం రాత్రి 12 గంటలకు టెట్ దరఖాస్తు గడువు ముగిసింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. టెట్ దరఖాస్తులు క్రమంగా తగ్గుతున్నాయి. 2016లో టెట్‌కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన టెట్‌కు 2,86,386 దరఖాస్తులు రాగా, ప్రస్తుత టెట్‌కు 2,75,773 దరఖాస్తులు వచ్చాయి.

ఇక నుంచి ఏటా రెండు సార్లు టెట్
ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షను ఇక నుంచి డిఎస్‌సి నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరి నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఏడాదిలోనే రెండో టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెట్ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టనుండగా, అంతకు ముందే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిఆర్‌టి) ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలి.

అంతే కాకుండా టెట్ చెల్లుబాటును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి గతంలోనే ఎన్‌సిటిఇ పొడిగించింది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం వారి స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాస్తారు. ప్రైవేట్, ప్రభుత్వం టీచర్లకు టెట్ తప్పనిసరి అనే నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బి.ఇడి, డిఐఇడి కోర్సులను పూర్తిచేసిన వారు టెట్ పరీక్ష రాశారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News