- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 278 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో మరో 111 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3లక్షల 2,047కి చేరాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,662 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,265 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 2.98 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 830 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 35 మందికి కరోనా వైరస్ సోకిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించారు.
278 New Covid-19 Cases Reported in Telangana
- Advertisement -