- Advertisement -
సుక్మా: జిల్లాలోని చింతగుఫాలో ఫుడ్ పాయిజన్ కారణంగా 28 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందిన సైనికులు అస్వస్థత చెందడంతో వారిని చికిత్స నిమిత్తం సిఆర్పీఎఫ్ ఫీల్డ్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు 12మంది జవాన్లకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాత ఆవనూనెతో చేసిన ఆహారం తినటం వల్ల ఫుడ్ పాజిన్ జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై కమాండెంట్ రాజేష్ యాదవ్ విచారణకు ఆదేశించారు.
28 CRPF Jawans fall ill with Food Poison in Sukma
- Advertisement -