Tuesday, September 17, 2024

ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్ను

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) నెట్‌వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంగళవారం ఢిల్లీలో జిఎస్‌టి కౌన్సిల్ 50వ సమావేశం జరిగింది. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్, హార్స్ రేసింగ్, క్యాసినోస్‌పై 28 శాతం పన్ను విధిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని ప్యానెల్ ఆన్‌లైన్ గేమింగ్‌పై చర్చించింది. అనంతరం గేమింగ్ ఆదాయం ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ అంగీకరించింది. ఈ నిర్ణయం మంత్రుల బృందం వద్దకు వెళ్లనుంది. ఈ పన్ను మొత్తం విలువపై విధిస్తామని సీతారామన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News