Friday, December 20, 2024

లగ్జరీ వస్తువులపై 28% జిఎస్‌టి కొనసాగుతుంది..

- Advertisement -
- Advertisement -

28% GST will continue on luxury goods

న్యూఢిల్లీ : లగ్జరీ, హానికరమైన వస్తువులపై 28 శాతం జిఎస్‌టి కొనసాగుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. అయితే 5 శాతం, 12 శాతం, 18 శాతం వంటి మూడు శ్లాబ్‌లను రెండు శ్లాబ్‌ల్లోకి తీసుకొచ్చే విషయంపై చర్చించనున్నామని తెలిపారు. పరిశ్రమ నాయకుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, జిఎస్‌టి ఆత్మపరిశీలనలో భాగంగా జిఎస్‌టి కౌన్సిల్ రేట్ల హేతుబద్ధీకరణ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి అయిన తర్వాత రేట్లపై కౌన్సిల్ మరోసారి సమీక్షిస్తోందని అన్నారు. గత నెల 27, 28 తేదీల్లో సమావేశమైన జిఎస్‌టి కౌన్సిల్ క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీపై 28 శాతం జిఎస్‌టి ప్రతిపాదనను వాయిదా వేసింది. జూన్ తర్వాత కూడా రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారం కొనసాగించాలని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కోరినప్పటికీ, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

47వ జిఎస్‌టి సమావేశంలో ప్రధానంగా చర్చించిన నాలుగు కీలక అంశాల్లో హేతుబద్ధీకరణ కమిటీ, రెండోది క్యాసినో,లాటరీ, మూడోది ఐటి, టెక్, నాలుగో అంశం విలువైన లోహాలు వంటివి ఉన్నాయి. జిఎస్‌టి కౌన్సిల్ ఆగస్టు మొదటి వారంలో మళ్లీ సమావేశం కానుంది. జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే, ప్రింటింగ్, డ్రాయింగ్ ఇంక్, ఎల్‌ఇడి ల్యాంప్‌లు, కత్తులు, బ్లేడ్‌లు, పవర్‌తో నడిచే పంపులు, డైరీ మెషినరీలపై జిఎస్‌టి పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పన్ను పెంపు ఉంది. ఇంకా ధాన్యాల మిల్లింగ్ యంత్రాలపై పన్ను 5 శాతం నుంచి 18 శాతానికి పెంపు, సోలార్ వాటర్ హీటర్, ఫినిషింగ్ లెదర్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పన్ను పెంపు, రూ.1,000 లోపు హోటల్ వసతిపై 12 శాతం పన్ను వంటివి ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News