- Advertisement -
అంకారా: టర్కీ దేశం బార్టిన్‌లోని అంస్రా ప్రాంతంలో ఓ బొగు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో 28 మంది మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. బొగ్గు గనిలో దాదాపుగా 35 మంది చిక్కుకుపోయారు. 110 మంది కార్మికులు ఆ గనిలో పని చేస్తుండగా ఈ పేలుడు జరిగిందని ఆ దేశపు మంత్రి సులేమాన్ సోయాల్ వెల్లడించారు. మిథేన్ వాయువుతోనే పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. గనిలో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బొగ్గు గని ప్రవేశం నుంచి 985 అడుగుల లోతు, 300 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని బార్టిన్ గవర్నర్ తెలిపారు.
- Advertisement -