Monday, December 23, 2024

కల్తీ జ్యూస్ తాగి 28 మందికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

28 people fell ill after drinking adulterated juice

గురుగ్రామ్ : పంజాబ్ లోని ఫరూఖ్ నగర్‌లో బుధోమాత ఆలయం వద్ద మంగళవారం సాయంత్రం కల్తీ జ్యూస్ తాగి 28 మంది అస్వస్థులయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్చగా ప్రథమ చికిత్స జరిగింది. బుధవారం వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆలయ ఆవరణలో ఎవరో అపరిచిత వ్యక్తి ప్రసాదం పేరుతో ఈ జ్యూస్ ఇచ్చాడని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన గురించి ప్రత్యక్ష సాక్షి ఢిల్లీకి చెందిన సుషీల్ కుమార్ వివరిస్తూ తమ కుటుంబం కారులోంచి దిగగానే ఒక వ్యక్తి వచ్చి ప్రసాదమని జ్యూస్ ఇచ్చాడని, అందరికీ పంచమని కూడా చెప్పాడని, అది తాగిన వెంటనే నాభార్య, మేనకోడలు స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు. ఇదే విధంగా మిగతా వారు కూడా జ్యూస్ తాగి ఉండారని సుషీల్ కుమార్ తెలిపారు. జ్యూస్‌లో మత్తు పదార్ధాలు కలిపినట్టు భావిస్తున్నారు. ఫరూఖ్‌నగర్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News