Monday, December 23, 2024

28 రాష్ట్రాలు, యుటిల్లో భూరికార్డుల్లో ఎన్‌జిడిఆర్‌ఎస్ విధానం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భూ రికార్డుల్లో నేషనల్ జెనెరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విధానం(ఎన్‌జిడిఆర్‌ఎస్)ను 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవలంభించనున్నాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ ప్రాంతాలు ఈరిజిస్ట్రేషన్ లేక నేషనల్ పోర్టల్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా డేటా షేరింగ్ విధానాన్ని ఇప్పటికే మొదలెట్టాయని తెలిపింది.

26 రాష్ట్రాలు యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్(యుఎల్‌పిఐఎన్) లేక భూఆధార్‌ను చేపట్టాయి. ఏడు రాష్ట్రాలలో పైలట్ టెస్టింగ్ జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలైతే స్వామిత్వా పోర్టల్‌తో యుఎల్‌పిఐఎన్‌ను ఇంటిగ్రేట్ చేశారు. ఏప్రిల్ 18 నాటికి 94.62 శాతం గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌ఓఆర్‌లను) కంప్యూటీకరించారు. 75.62 శాతం పటాలను డిజిటలైజ్ చేశారు.
92.82 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కంప్యూటీకరించబడ్డాయి. 79.60 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రెవెన్యూ కార్యాలయాలతో సమీకృతం చేశారు. దీనికి తోడు 85.73 శాతం మోడర్న్ రికార్డు రూమ్స్(ఎంఆర్‌ఆర్)లను ఏర్పాటుచేశారు. కేంద్ర రంగ పథకం కింద భూవనరుల శాఖ ‘డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నయిజేషన్ ప్రోగ్రామ్(డిఐఎల్‌ఆర్‌ఎంపి)ని అమలు చేస్తోంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం ఫండింగ్ చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News