- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. తాజాగా 4.71 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2827 కొత్త కేసులు వచ్చాయి. మరోరోజు మూడు వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 3230 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. క్రియాశీల కేసులు 19 వేలకు పడిపోయాయి. సుమారు రెండేళ్లలో 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా, 98.74 శాతం మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి తగ్గడం సానుకూలాంశం. బుధవారం 24 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు 5.24 లక్షల మందికి పైగా మృతి చెందారు. బుధవారం 14.85 లక్షల మంది టీకా తీసుకోగా, మొత్తం ఇప్పటివరకు 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని గురువారం కేంద్రం వెల్లడించింది.
- Advertisement -