Saturday, November 23, 2024

ఉచిత విద్యుత్ కోసం 28,550 మంది దరఖాస్తు: సిఎస్

- Advertisement -
- Advertisement -

28550 people applied for free electricity

 

హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది దరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుంచి, 17913 దరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి స్వీకరించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడారు.

ఈ పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బిసి సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని ఆదేశించారని, లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటి అధికారులను ఆదేశించారు.  సిజిజి లో రిజిష్ట్రరు చేసుకున్న ధరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత డిస్కామ్ లకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం జివొ. ఎంస్. నెం. 2 తేది 04-04-2021 బిసి వెల్పేర్ (డి) డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేయడంతో పాటు నియమనిబంధనలు కూడ విడుదల చేసిందన్నారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, బిసి వెల్ఫేర్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, టిఎస్ఎస్ పిడిసిఎల్, సిఎండి రఘుమారెడ్డి, బిసి వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, వాషర్ మెన్ ఎండి చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ్ ఎంసి. ఎంఎస్. విమల, తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News