Tuesday, November 19, 2024

2023లో మహిళలపై 28,811 నేరాల ఫిర్యాదులు.. యుపిలో 50 శాతం కన్నా ఎక్కువ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత ఏడాది మహిళలపై 28,811 నేరాలను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్లు) నమోదు చేసింది. వీటిలో 55 శాతం ఉత్తరప్రదేశ్ నుంచే నమోదయ్యాయి. గృహహింస కాకుండా మహిళల గౌరవ హక్కులకు భంగం కలిగించే ఫిర్యాదులు దాదాపు 8540 వరకు ఉన్నాయని ఎన్‌సిడబ్లు వెల్లడించింది. ఇక గృహహింస ఫిర్యాదులు 6274 వరకు ఉన్నాయి. వరకట్నం వేధింపుల ఫిర్యాదులు 4797, వేధింపుల ఫిర్యాదులు 2349, పోలీస్‌ల ఉదాసీనతపై 1618 ఫిర్యాదులు, అత్యాచారం, అత్యాచార యత్నం పై ఫిర్యాదులు 1537 వరకు ఉన్నాయని డేటా వివరించింది.

లైంగిక వేధింపులు 805, సైబర్ నేరాలపై ఫిర్యాదులు 605, వెంబడించడంపై ఫిర్యాదులు 472, పరువు ప్రతిష్టపై 409 ఫిర్యాదులు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్‌లో మహిళపై నేరాలకు సంబంధించి 16,109 ఫిర్యాదులు రాగా, ఢిల్లీ నుంచి 2411, మహారాష్ట్ర 1343, ఫిర్యాదులు వచ్చాయి. బీహార్ నుంచి 1312, మధ్యప్రదేశ్ నుంచి 1165, హర్యానా నుంచి 1115, రాజస్తాన్ నుంచి 1011. తమిళనాడు నుంచి 608, పశ్చిమబెంగాల్ నుంచి 569, కర్ణాటక నుంచి 501 ఫిర్యాదులు వచ్చాయి. 2014లో ఈ ఫిర్యాదులు చాలా ఎక్కువగా నమోదు కాగా,2022లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30,864 వరకు నమోదయ్యాయి. అప్పటినుంచి ఈ ఫిర్యాదులు తగ్గాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News