Saturday, November 23, 2024

దేశంలో కొత్తగా 28,903 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

28903 New Covid-19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 28,903 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 17,741 రికవరీలు, 188 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,38,734కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,10,45,284 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో 2,34,406 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,59,044 మంది కరోనాతో మృతి చెందారు. ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 3,50,64,536 మందికి కరోనా టీకా వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, భారత్ లో నిన్నటి వరకు మొత్తం 22,92,49,784 కోవిడ్-19 పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. మంగళవారం 9,69,021 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.

28903 New Covid-19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News