- Advertisement -
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద తాత్కాలిక నిర్మాణం కుప్పకూలి 29 మంది గాయపడ్డారు. స్టేడియం గేట్ 2 వద్ద వివాహ కార్యక్రమం కోసం తాత్కాలికంగా వేదిక ఏర్పాటు చేస్తుండగా శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌లు చెప్పారు. గాయపడిన వారిలో 18 మందిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేర్చారు. 11 మందిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఏడుగురిని ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు. మరొకరికి ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని పోలీస్ అధికారి చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. తాత్కాలిక నిర్మాణం కూలినట్టు సమాచారం అందగానే అక్కడకు వెళ్లి ఇద్దరిని శిధిలాల నుంచి రక్షించినట్టు ఢిల్లీ ఫైర్‌సర్వీస్ అధికారి చెప్పారు.
- Advertisement -