Wednesday, January 22, 2025

తెలంగాణ రాష్ట్రంలో 29 మెడికల్‌ కాలేజిలు మంజూరు: మంత్రి హరీష్‌ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 29 ప్రభుత్వ మెడికల్ కాలేజిలను మంజూరు చేసిందని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు గాదిర కిషోర్, డా.సంజయ్, మెతుకు ఆనంద్ , యాదగిరిరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ బదులిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజిల్లో ఇప్పటికే 21 కాలేజిలు నిర్మాణాలు పూర్తి చేసుకుని నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.మరో ఎనిమిద కాలేజిల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. రా్రష్ట్రంలో ప్రభుత్వ , ప్రవైటు రంగాల్లోని మెడికల్ కాలేజిలల్లో ఎంబిబిఎస్‌కు కోర్సుకు సంబంధించి 8515 సీట్లు ఉన్నాయని , పిజిలో 2890 సీట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 56మెడికల్ కాలేజిలు ఉండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు 26, ఇఎస్‌ఐ కళాశాల ఒకటి, ఎయిమ్స్ ,ప్రైవేటు కళాశాలలు 28 ఉన్నట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News