Sunday, January 12, 2025

గాజాలోని ఆస్పత్రి పరిసరాల్లో దాడులు… 29 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర గాజాలోని అద్వాన్ ఆస్పత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ సంఘటనలో నలుగురు వైద్య సిబ్బంది సహా 29 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులతో సుమారు లక్షమంది పాలస్తీనియన్లు సరైన ఆహారం, వైద్య సదుపాయం లేక అలమటిస్తున్నారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొంది.

గాజాలోని ఆస్పత్రుల్లో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని, అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 44,600 మంది పాలస్తీనియన్లు మరణించారని, అందులో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓవైపు ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నా, దాడులు మాత్రం తగ్గకపోవడం ఆందోళనకరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News