Friday, December 20, 2024

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 29,000 మంది పాలస్తీనియన్ల మృతి

- Advertisement -
- Advertisement -

రఫా (గాజా స్ట్రిప్ ): ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 29,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. హమాస్ పాలన లోని గాజాకు చెందిన మంత్రిత్వశాఖ సోమవారం ఈ వివరాలు తెలియజేస్తూ గత 24 గంటల్లో ఆస్పత్రులకు 107 మృతదేహాలు వచ్చాయని, వీటితో మొత్తం మృతుల సంఖ్య 29,902 కు చేరిందని ప్రకటించింది.

ఈ సంఖ్యలో ఎంతమంది పౌరులు ఉన్నారో , ఎంతమంది తిరుగుబాటు దారులున్నారో వివరించలేదు. అయితే ఎక్కువ సంఖ్యలో మహిళలు, చిన్నారులు మృతి చెందారని పేర్కొంది. హమాస్ నేతృత్వం లోని మిలిటెంట్లు అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. 250 మందిని బందీలుగా చేశారు. 1200 మంది మృతి చెందారు. నవంబర్‌లో కాల్పుల విరమణ సమయంలో 100 మంది బందీలు విడుదలయ్యారు. అయితే అదే సమయంలో ఇజ్రాయెల్ లో 240 మంది పాలస్తీనియన్లు బందీలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News