న్యూఢిల్లీ : కొద్ది రోజులుగా రెండు వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మూడు వేలకు చేరువయ్యాయి. ఢిల్లీలో వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం మంగళవారం 5.05 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, 2,927 కొత్త కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగింది. ఒక్క ఢిల్లీ లోనే 1204 మందికి వైరస్ సోకింది. హర్యానాలో 517 కేసులు నమోదయ్యాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరం, రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4.30 కోట్ల మంది కొవిడ్ బారిన పడగా, 5.23 లక్షల మరణాలు సంభవించాయి. మంగళవారం ఒక్క రోజే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళ ప్రకటించిన సంఖ్యే 26. గత 24 గంటల వ్యవధిలో 2252 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి. క్రియాశీల కేసులు 16,279 కి చేరాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. ఇక మంగళవారం 21.97 లక్షల మంది టీకాలు తీసుకోగా, ఇప్పటివరకు 188 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.
3 వేలకు చేరువలో కరోనా కొత్త కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -