Friday, January 10, 2025

అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు 2జీ, 3జీ, 4జీ పార్టీలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం జనగాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ మినహా ప్రస్తుతం ఉన్నవన్నీ కుటుంబ పార్టీలేనని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ 2జీ పార్టీ అని..అంటే కేసీఆర్, కేటీఆర్ లపార్టీ అని, మూడు  తరాలుగా వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం 3జీ పార్టీ అనీ, కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీల వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి కాబట్టి అది 4జీ పార్టీ అని అమిత్ షా వివరించారు. బీజేపీ మాత్రం తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా సెప్టెంబర్ 17న విమోచన దినం నిర్వహిస్తామనీ, బైరాన్ పల్లిలో అమరవీరుల స్మారకం నిర్మిస్తామని అమిత్ షా చెప్పారు. అవినీతికి పాల్పడినవారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News