Monday, December 23, 2024

ఆమనగల్లులో 2కె రన్

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమనగల్లు పోలీసు సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం 2 కే రన్ వేను ఘనంగా నిర్వహించారు. 2కె రన్ వేను మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్‌నాయక్, వైస్‌చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వి. శ్యాంసుందర్‌లతో కలిసి ఆమనగల్లు సిఐ జాల ఉపేందర్ జెండాను ఊపి రన్ వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పట్టణంలోని పోలీసుస్టేషన్ నుంచి జాతీయ రహదారి మీదుగా 2కె రన్ కొనసాగింది. అనంతరం స్థానిక చౌరస్తా వద్ద ప్రజా ప్రతినిధులు, పోలీసు శాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పండుగల జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 2కె రన్‌కు ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టణ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. పోలీసు అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు తమ విధులను నిర్వహించడం జరుగుతుందని సిఐ ఉపేందర్ తెలిపారు. విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తున్నారని సీఐ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశ చరిత్రలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 2కె రన్‌లో నాయకులు నేనావత్ పత్యనాయక్, సోనాశ్రీనునాయక్, బాణావత్ లక్ష్మణ్‌నాయక్, దోనాదుల కుమార్, చుక్క నిరంజన్, సయ్యద్ ఖలీల్, బావండ్ల బాస్కర్, ఎంగలి ప్రసాద్, కృష్ణనాయక్, ఎసైలు వి. సుందరయ్య, హరీష్‌శంకర్‌గౌడ్, వెంకటేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News