Monday, December 23, 2024

పేటలో 2కె రన్

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని అశ్వారావుపేటలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు. స్థానిక రింగ్‌రోడ్ సెంటర్ నుంచి 2కె రన్ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ జెండా ఊపి ప్రారంభించగా స్థానిక వ్యవసాయ కళాశాల వరకూ సాగింది.

అనంతరం కళాశాలలో నిర్వహించిన సభలో ముందుగా శాంతికి చిహ్నంగా పావురాలను గాల్లో వదిలారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినందున మనం దశాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. అందరి ఐక్యమత్యానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలుస్తుందన్నారు.

ప్రజల కోసం పోలీస్‌లు ఉన్నారని శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రాజేష్ కుమార్ పలువురు బిఆర్‌ఎస్ నాయకులు, పలు శాఖల అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News