Wednesday, January 22, 2025

బాన్సువాడలో 2కె తెలంగాణ రన్

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండా ఊపి రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని భారత్ గార్డెన్ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టేడియం వరకు 2కె రన్ కొనసాగింది. యువకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ శాఖాధికారులు రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. దేశ రక్షణకు సైనికులు నిరంతరం శ్రమిస్తారని, వారి వల్లే మనం దేశంలో హాయిగా జీవిస్తున్నామన్నారు.

తెలంగాణ పోలీసులు నిత్య విద్యార్థులని, శాంతి భద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడు పని చేస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, పిట్ల శ్రీధర్, పాత బాలకృష్ణ, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు.

డీఎస్పీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన…
పట్టణంలోని సాయికృప నగర్‌లో బాన్సువాడ డీఎస్పీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ రెడ్డి, సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News