Monday, December 23, 2024

అమర్‌నాథ్‌కు 2వ జట్టు యాత్రికుల పయనం

- Advertisement -
- Advertisement -

జమ్మూ: గట్టి భద్రతా ఏర్పాట్ల నడుమ రెండవ బృందానికి చెందిన 5,700మంది యాత్రికులు దక్షిణ హిమాలయాలలో కొలువై ఉన్న అమరనాథ్ పుణ్యక్షేత్ర సందర్శనకు గురువారం జమ్మూ నుంచి బయలుదేరి వెళ్లారు. 230 వాహనాలలో వీరంతా భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి గురువారం ఉదయం బయల్దేరి వెళ్లారు. 43 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 11న రక్షా బంధన్ పండుగ నాడు ముగియనున్నది. ఈ రెండవ బృందంతో కలిపి ఇప్పటివరకు జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన భక్తుల సంఖ్య 10,700కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా రెండేళ్లు రద్దయిన అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ఈ ఏడాది ప్రారంభమైంది. కశ్మీరులోని హిమాలయాలలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ గుహలో మంచు శివలింగం దర్శనమిస్తుంది. అమర్‌నాథ్ యాత్ర కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తాజాగా మరో 5,000 నుంచి 6,000 మంది యాత్రికులు జమ్మూ చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. మూడు కౌంటర్లలో ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్, రెండు కౌంటర్లలో టోకెన్ల సరఫరా అనంతరం వారు ఇక్కడి 32 లాడ్జీలు, బేస్ క్యాంపులలో బస చేసినట్లు వారు తెలిపారు.

2nd Batch Pilgrims leaves from Jammu for Amarnath Yatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News