మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సెకండ్ డోస్ పంపిణీ ప్రారంభమైంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 3950 మంది తొలి డోసు వేసుకోగా, 71,365 మంది సెకండ్ డోసు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55,88,576 మందికి టీకా పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మంగళవారం కేవలం కొవాగ్జిన్ డోసులను మాత్రమే ఇచ్చారు. దీంతో పలు కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అతి తక్కువ మంది అర్హలు ఉండటంతో కేవలం రెండు మూడు గంటల్లో సెకండ్ డోసు పూర్తయినట్లు అధికారులు చెబుతన్నారు. మరోవైపు కొత్త మార్గదర్శకాల ప్రకారం కొవిషీల్డ్ రెండో డోసు గడువు 12 నుంచి 16 వారాలకు పెంచారు. దీంతో ప్రస్తుతానికి మన రాష్ట్రంలో కొవిషీల్డ్ సెకండ్ డోసు అర్హులు లేనట్లేనని వైద్యశాఖ చెబుతుంది. ఈక్రమంలోనే నిల్వ ఉన్న డోసులను సూపర్ స్ప్రెడర్లకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పంపించిన డోసులు కలిపి దాదాపు 10.2 లక్షల డోసులు స్టోరేజ్ కేంద్రాల్లో ఉన్నట్లు వైద్యశాఖ వివరించింది.
2nd Dose vaccination drive starts in Telangana