Thursday, January 23, 2025

హైదరాబాద్ లో 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2023-ఆల్-ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం (AISEF) యొక్క లాభాపేక్షలేని సాంకేతిక భాగస్వామి అయిన వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WSO), 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 యొక్క యొక్క మొదటి రోజును విజయవంతంగా ముగించింది. “ఆహార భద్రతా సుగంధ ద్రవ్యాలు – స్థిరమైన & నిలకడతో కూడిన ఆదాయానికి ముందుకు వెళ్ళే మార్గం” (ఫుడ్ సేఫ్ స్పైసెస్ -ది వే ఫార్వార్డ్ టు స్టేబుల్ & సస్టైనబుల్ ఇన్కమ్) అనే నేపథ్యంకు అనుగుణంగా ఈ సదస్సు జరిగింది . ఈ సదస్సులో నిపుణులు, పరిశ్రమ నాయకులు సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు.

వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ రామ్‌కుమార్ మీనన్, ఈ సదస్సులో పాల్గొనేవారికి ఆత్మీయ స్వాగతం పలికారు. సుగంధ ద్రవ్య పరిశ్రమ యొక్క భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సామూహిక ప్రయత్నాల యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఆయనే మాట్లాడుతూ.. “మన సుగంధ ద్రవ్యాల భద్రత అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, మన రైతులు, వినియోగదారులకు ఒకే తరహా, స్థిరమైన భవిష్యత్తును నిర్మించటానికి చూపాల్సిన నిబద్ధత. పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ మంచి, మరింత స్థిరమైన ఆదాయానికి అవకాశాలు వున్నాయని పరిశ్రమ కూడా నిర్ధారించాలి” అని అన్నారు.

తన ప్రారంభోపన్యాసంలో, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ అఫ్ అరేకనట్ అండ్ స్పైస్ డెవలప్‌మెంట్ (DASD) డైరెక్టర్ డాక్టర్ హోమి చెరియన్, మాట్లాడుతూ.. “సుగంధ ద్రవ్యాలు ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన చోధకాలు. స్థిరమైన వృద్ధి, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వ విధానాలు సూచించబడ్డాయి” అని అన్నారు.

డాక్టర్ ఎ బి రీమాశ్రీ, డైరెక్టర్ – రీసెర్చ్, స్పైసెస్ బోర్డ్ మాట్లాడుతూ సురక్షితమైన మసాలా సాగును ప్రోత్సహించడానికి అవసరమైన పరిజ్ఞానం పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..” ఆహార భద్రత పరంగా సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో రాజీ పడటం జరగదు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, అధిక నాణ్యత గల సుగంధ ద్రవ్యాలను అందించడానికి మనం వ్యూహాలు ఖచ్చితంగా ప్రతిబింబించాలి” అని అన్నారు.

అదనంగా, NSC 2023 యొక్క వ్యాపార కమిటీ చైర్మన్ చెరియన్ జేవియర్ మాట్లాడుతూ.. ” ‘ఫుడ్ సేఫ్ స్పైసస్ – ది వే ఫార్వార్డ్ టూ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్ ‘ సదస్సు కేవలం దృష్టి సారించిన ఒక సదస్సు మాత్రమే కాదు. మన భవిష్యత్తును బాధ్యతాయుతంగా, స్థిరంగా పరిశ్రమ తీర్చిదిద్దటానికి ఇది మనకు పిలుపు” అని అన్నారు.

నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2023 ఒక కీలకమైన కార్యక్రమం అని హామీ ఇచ్చింది, సుగంధ ద్రవ్యాల రంగం యొక్క భద్రత,  స్థిరత్వాన్ని నిర్ధారించడానికి భాగస్వామ్యం, సంభాషణలను ప్రోత్సహిస్తుంది. సెషన్ యొక్క రెండవ రోజు మెరుగైన ఇన్పుట్ నిర్వహణ, ఉత్పాదకత, వినూత్న ప్రక్రియలు, మార్కెట్ పోకడలు, సుగంధ ద్రవ్యాల వినూత్న ప్యాకేజింగ్ సవాళ్లు, అవకాశాలు వంటి అంశాలపై, పరిజ్ఞానం ప్రదర్శిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఆహార-సురక్షిత పద్ధతులు, సుగంధ ద్రవ్యాలు రైతులకు స్థిరమైన, నిలకడ తో కూడిన ఆదాయానికి దారితీసే భవిష్యత్తు కోసం ఆకర్షణీయమైన చర్చలు, నిపుణుల సూచనలు, క్రియాత్మక వ్యూహాలను ఆశించవచ్చు.

నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2023 పరిశ్రమ నాయకులు, నిపుణులు, వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, మొత్తం సుగంధ ద్రవ్యాల రంగాన్ని పెంచే లక్ష్యంతో వ్యూహాలను అమలు చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ ఎఫ్‌పిఓలు, ఎన్జిఓలు హాజరయ్యారు. నేషనల్ సస్టైనబుల్ స్పైస్ ప్రోగ్రాం (ఎన్‌ఎస్‌ఎస్‌పి) తో సంబంధం ఉన్న సుమారు 25,000 మంది రైతులకు సమిష్టిగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. NSSP అనేది ప్రపంచ స్పైస్ సంస్థ యొక్క ప్రముఖ కార్యక్రమం. ఇది భారతదేశంలో ఆహార-సురక్షిత, స్థిరమైన సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో ఈ స్థిరమైన ఉత్పత్తి వస్తువులకు మార్కెట్ ప్రాప్యతను కూడా సులభతరం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News