మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్‌ను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. జాంబియాకు చెందిన ఓ మహిళ నుండి 3.2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. జాంబియాకు చెందిన యువతి ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో దోహా మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొంది. ఆమె హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. నేరుగా ఆస్ట్రేలియా వెళ్లకుండా హైదరాబాద్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్‌పోరుఓ్టలో ఆమె లగేజిని చెక్ చేసిన సమయంలో తెల్లటి పౌడర్‌ను డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. ఈ తెల్లటి పౌడర్‌ను పరికిస్తే హెరాయిన్‌గా తేల్చారు. హైదరాబాద్ గుండా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయమై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ డ్రగ్స్ తరలిస్తున్న యువతిని డిఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు.
3.2 Kg Heroin Seized in Shamshabad Airport