Sunday, December 22, 2024

రాష్ట్ర ఓటర్లు 3.21 కోట్లు

- Advertisement -
- Advertisement -

పురుష ఓటర్లు 1,60,97,014
మహిళ ఓటర్లు 1,60,89,156
80 పైబడి వయస్సు గల ఓటర్లు 4,39,566
దివ్యాంగులు(పిడబ్ల్యుడి) ఓటర్లు 5,06,779
రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్లు 35,356

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తాజాగా ఓటర్ల సంఖ్య 3.21.88.753 చేరిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జనగణన 2011 జరిపిన గణంకాల మేరకు రాష్ట్ర జనాభా 3,50,53,761 ఉండగా.. తాజాగా ఓటర్లు సంఖ్య 3.21 కోట్ల ఓటరుకు చేరుకుంది. 2018లో పురుష ఓటర్లు 1,41,56,355 ఉండగా.. తాజాగా 1,60,97,014 చేరుకోగా… మహిళలు 2018లో 1,39,06,586 ఉండగా.. తాజాగా 1,60,89,156కు చేరుకున్నారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,583 కాగా, సర్వీస్ ఓటర్లు 15,395 మంది, విదేశాల్లో స్థిరపడిన ఓటర్లు 2,859తో రాష్ట్రంలో ఓటర్లు సంఖ్య 3,21,88,753కు చేరుకుంది. ప్రధానంగా 18- నుంచి 19 సంవత్సరాలు మధ్య గల యువత 9,10,810 మంది కాగా,
20- నుంచి 29 వయస్సు ఓటర్లు 62,58,084, 30 నుంచి-40 వయస్సులోపు వారు 1,00,22,566,41 నుంచి-60 వయస్సు గలవారు 1,08,03,759 మంది ఉండగా.. 60 పై వయస్సు ఉన్నవారుగు 41,93,534 ఓటర్లు ఉన్నారు. 80 సంవత్సరాలకు పైబడిన ఓటర్లు 2018లో 2,95,539 ఉండగా.. తాజా వివరాల మేరకు 4,39,566 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పిడబ్ల్యుడి ఓటర్లు 5,06,779 మంది ఉన్నట్లు వెల్లడించారు.
మూడు జిల్లాల పరిధిలో 8 నియోజకవర్గాలు…
తెలంగాణ రాష్ట్ర నైసర్గిక భౌగోళిక ప్రాంతం 1,12,077 చ.కి.మీల పరిధిలో ఎన్నికల నిర్వహించనున్నారు. 33 జిల్లాల పరిధిలోని 74 రెవెన్యూ డివిజన్‌లు, 613 మండలాలు, పట్టణ ప్రాంతాలు 141 కాగా.. 17 పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్యలో ఎస్సీ: 3, ఎస్టీ: 2, జనరల్ : 12 స్థానాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలు 119తో పాటు 1 ఆంగ్లో ఇండియన్ (నామినేట్ చేయబడింది) ఏర్పాటు చేయగా..ఎస్సీ : 19, ఎస్టీ : 12, జనరల్ : 88 స్థానాలు ఉన్నాయి. ఒకే జిల్లా పరిధిలో 75 నియోజకవర్గాల భౌగోళిక ప్రాంత పరిధి ఉండగా.. రెండు జిల్లాల పరిధిలో 36 నియోజకవర్గ స్థానాలు, మూడు జిల్లాల పరిధిలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో భౌగోళికంగా అతి చిన్న చార్మినార్ (5.31 చదరపు కిమీలలో),అతి పెద్దదిగా ములుగు 3979.3 (చదరపు కిమీలలో) ఉంది. నియోజకవర్గరు ఓటర్ల పరిమాణంలో చిన్నదిగా భద్రాచలం ( 1,46,183 ఓటర్లు), అతి పెద్దదిగా శేరిలింగంపల్లి (6,94,968 ఓటర్లు) ఉంది.
రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 35,356..
రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో పట్టణ ప్రాంతాల్లో14,458, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1500 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కేంద్రాల్లో మహిళలలే నిర్వహించే పోలింగ్ కేంద్రాలు 610 ఉండగా, పీడబ్ల్యూడీ నిర్వహించే కేంద్రాలు 119, మోడల్ పోలింగ్ స్టేషన్లు 670 ఉండగా.. వివిధ పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ 27,000 నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణలో వినియోగించే ఇవిఎం సంబంధించి.. బియులు : 72,931, సియు: 57,692, వివి ఫ్యాట్‌లు 56,747 ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు 119 ఉండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాలు 49ఉండగా.. 1,96,312 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News