- Advertisement -
ఢిల్లీ: కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ ధాటికి మహానగరాలు గజ గజ వణికిపోతున్నాయి. దేశమంతటా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉంది. గత 24 గంటల్లో 3.29 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 3879 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 2.29 కోట్లకు చేరుకోగా 2.5 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.9 కోట్ల మంది కోలుకోగా 37.1 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు భారత దేశంలో 30.56 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. 17.3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
- Advertisement -