Saturday, December 21, 2024

రూ.3.39 లక్షల కోట్లు హాంఫట్

- Advertisement -
- Advertisement -

1,292 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

3.39 Lakh crore loss with market fall down

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడితో సోమవారం కూడా మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ అత్యధికంగా 1,291 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు ఆవిరైంది. బలహీనంగా ప్రారంభమైన బిఎస్‌ఇ సెన్సెక్స్ ఆఖరికి 1,292 పాయింట్లు పడిపోయి 57,047 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 302 పాయింట్లు పడిపోయి 17,173 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఎన్‌టిపిసి, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం భయం, చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, రష్యాపై విధించిన నిషేధం మార్కెట్ పతనానికి కారణమని భావిస్తున్నారు. బ్యాంక్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా షేర్లలో అత్యధిక పత నం కనిపించింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 10 లాభపడగా, 20 నష్టాల్లో ఉన్నాయి. బిఎస్‌ఇ లిస్టె ట్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.39 లక్షల కోట్లు పడిపోయి రూ.268.63 లక్షల కోట్ల కు చేరింది. ఆటో, ఎఫ్‌ఎంసిజి, మెటల్ మినహా అన్నిరంగాలు క్షీణించాయి. నిఫ్టీలోని 11 రంగాల సూచీల్లో 3 లాభపడగా, 8 నష్టాలను చవిచూశా యి. దీనిలో మెటల్ ఇండెక్స్ (0.33 శాతం), ఎఫ్‌ఎంసిజి (0.33 శాతం), ఆటో (0.44 శాతం) లాభపడ్డాయి. మరోవైపు రియాల్టీ, ఫార్మా, ఐటి, మీడియా, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంకుల్లో క్షీణత కనిపిస్తోంది.
49 శాతం పెరిగిన మైండ్‌ట్రీ లాభం
మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఫలితాల్లో ఐటి కంపెనీ మైండ్‌ట్రీ నికర లాభం 49 శాతం పెరిగి రూ.473 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.317 కోట్లుగా ఉంది. అంతకుముందు మూడో త్రైమాసికంలో లాభం 437.5 కోట్లు నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 37 శాతం పెరిగి రూ.2,897 కోట్లకు చేరుకుంది. గతేడాదిలో ఆదాయం రూ.2,109 కోట్లుగా ఉంది. అదే సమయంలో మైండ్‌ట్రీ కూడా ఒక్కో షేరుకు రూ.27 డివిడెండ్ ప్రకటించింది. మార్కెట్ ముగిసిన తర్వాత మైండ్‌ట్రీ ఫలితాలను ప్రకటించింది. స్టాక్‌మార్కెట్లో ఈ స్టాక్ 3.27 శాతం పడిపోయి రూ.3,965 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News